పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ….

మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హనుమంత రెడ్డి…

బిక్కనూరు, ఆంధ్రప్రభ : ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బిక్కనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ హనుమంత రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నష్టపోయిన పంటలను పరిశీలించారు నేలకొరిగిన పంటలను చూసి నాయకులు కంటతడి పెట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంటలు చేతికి వచ్చే సమయంలో వడగళ్ల వర్షాల వల్ల చేతికి రాకుండా పోయిందని ఆవే దన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎకరాకు 30 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని సైతం వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారని గుర్తు చేశారు . నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున రైతుల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. అప్పులు చేసి పంటలు రైతులు సాగు చేశారని ఈ సందర్భంగా పూర్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడూరి సాయాగౌడ్, మాజీ రైతు కన్వీనర్ మంద లింగం, మాజీ ఉప సర్పంచ్ వడ్ల బ్రహ్మచారీ, మాజీ ఎంపీటీసీ సభ్యులు గోల్కొండ రాములు, వడ్ల శ్రీనివాస్ చారీ, ఎర్రోళ్ల స్వామి, ఈర స్వామి, పెద్దోల్ల అనిల్, మంద ఎల్లం రాజు పార్టీ కార్యకర్తలు , రైతులు పాల్గొన్నారు.

Leave a Reply