20thing| ఏం చేయాలంటే..?

20thing| ఏం చేయాలంటే..?
20thing కంప్యూటర్ల ముందు కూర్చొవడం
స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల వాడకం వల్ల
అలాగే కళ్లకు కూడా వ్యాయామం
20thing ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రస్తుత కాలంలో కంటిచూపు సమస్యలు అనేకమంది ఎదుర్కొంటున్నారు. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల వాడకం వల్ల చిన్నాపెద్ద తేడా లేకుండా కంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి ఫోన్ స్క్రీన్ చూడటం… కంప్యూటర్ల ముందు కూర్చొవడం వల్ల కంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంటి సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని పోషకాలు ఉన్న ఆహార తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే కళ్లకు కూడా వ్యాయామం అవసరమని వైద్యులు చెబుతున్నారు.

కంటికి కావాల్సిన పోషకాహారం
- విటమిన్ A ఉన్న క్యారెట్లు, బొప్పాయి తీసుకుంటే కంటికి మేలు
- పాలకూర, గింజలు తీసుకుంటే లూటిన్, జింక్ లభిస్తుంది.
- చేపలు, వాల్నట్స్, విత్తనాలు తింటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి.
- నారింజ, నిమ్మ వంటివి కంటిలోని రక్తనాళాలకు మేలు చేస్తాయి.
మరికొన్ని సలహాలు
- ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూడటం ఆపాలి.
- సరైన భంగిమలో కూర్చోవాలి
- మనం కూర్చునే విధానం కూడా కంటి చూపుపై ప్రభావం చూపుతుంది.
- స్క్రీన్ కళ్ళకు కనీసం ఒక చేతి దూరంలో ఉండాలి.
- స్క్రీన్ కంటి చూపు స్థాయి కంటే కొంచెం కిందకు ఉండేలా చూసుకోవాలి.
- గదిలో మరీ చీకటిగా లేదా మరీ ఎక్కువ కాంతి ఉండకూడదు.
- తగినంత వెలుతురు ఉండాలి.
- మీ కళ్ళను 10–15 సార్లు వేగంగా ఆర్పండి. ఆ తర్వాత విశ్రాంతి కోసం కొన్ని సెకన్ల పాటు కళ్ళు మూసుకోండి.
- ప్రతిరోజూ 7–9 గంటల పాటు మంచి నిద్ర పొందండి.
- నిద్రలేమి వల్ల కళ్ళు పొడిబారడం, కనురెప్పలు అదరడం, దృష్టి మసకబారడం వంటి సమస్యలు వస్తాయి.
- డీహైడ్రేషన్ వల్ల కళ్ళు పొడిబారి, దృష్టి మసకబారుతుంది.
- అందువల్ల, ప్రతిరోజూ 8–10 గ్లాసుల నీరు తాగండి.
- కెఫీన్, ఆల్కహాల్ తీసుకోవడాన్ని పరిమితం చేసుకోండి.
- బయట ఉన్నప్పుడు UV-రక్షణ ఉన్న సన్ గ్లాసెస్ ధరించండి.
- ఇది కంటి శుక్లాలు, రెటీనా సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- ధూమపానం కంటి నరాల మీద ప్రభావం చూపుతుంది, కాబట్టి దానికి దూరంగా ఉండటం మంచిది.
- సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల నుండి కళ్లను రక్షించుకోవడానికి సన్‌గ్లాసెస్ ధరించండి.
- చేతులు కడుక్కోకుండా కళ్లను తాకవద్దు, నలపవద్దు. ఇది ఇన్ఫెక్షన్లను, దుమ్మును కళ్లలోకి చేరకుండా ఆపుతుంది.

