విద్యుత్ పరికరాలు చోరి.. ఆవేదనలో రైతులు..

విద్యుత్ పరికరాలు చోరి.. ఆవేదనలో రైతులు..
కుంటాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కుంటాలతో పాటు కల్లూరు వెంకూర్ శివారు ప్రాంతంలోని పలు రైతులకు చెందిన పంట క్షేత్రాల్లో విద్యుత్తు పరికరాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డట్టు తెలియచేశారు. అయితే.. మొక్కజొన్న చేతికి వచ్చే సమయంలో విద్యుత్ పరికరాలను విద్యుత్తు వైరు, ఫీజులు దొంగలించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అంతే కాకుండా దాదాపు నాలుగు బోరు బావుల వద్ద నుండి ఎత్తుకెవెళ్ళిన పరికరాలు విలువ సుమారు 15 నుండి 20 వేలకు పైగా ఉంటుందని రైతులు వాపోయారు. ఈ విషయమై సంబంధిత పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా రైతులు చెప్పారు. అంతే కాకుండా గత నెల రోజుల క్రితం అందకూర్ శివారు ప్రాంతంలోని ట్రాన్స్ఫార్మర్, విద్యుత్తు పరికరాలను సైతం దొంగలించారు. రైతులు వెంటనే దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు.
