Resignation | చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేశా…

Resignation | చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేశా…

Resignation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. జగిత్యాలలో రాజీనామా చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ…. ఇప్పటి నుంచి రేవంత్ పై పోరాటం చేస్తానన్నారు. గతంలో చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేశానన్నారు. నన్ను అణగదొక్కాలని చూశారన్నారు. అవమానాలు, అన్యాయాలపై ఎందుకు ఓపిక పట్టాలని ప్రశ్నించారు. తాను కనీసం మంత్రి పదవికి అర్హుడిని కాదా అన్నారు. కాంగ్రెస్ లో ఇంకెవరూ ఎదగకూడదా..? వేంన‌రేంద‌ర్ రెడ్డికి రాజ్య‌స‌భ ఎలా ఇస్తారు..? ఎంత‌మందిని ఇలా తొక్కుకుంటూ పోతార‌ని ప్ర‌శ్నించారు.

త‌న‌కు తోడుగా నిలిచిన నాయకుడిని నడిబజారులో కిరాతకంగా చంపారన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తకు దారుణ ఘటన జరిగితే స్పందించకూడదా? త‌నకు తోడుగా నిలిచిన నాయకుడు చనిపోతే సీఎం నుంచి కనీస పరామర్శ లేదన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్త దారుణంగా చనిపోతే కుటుంబానికి కనీస ఓదార్పు లేదన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుందామనే భరోసా కల్పించలేదన్నారు. తాను శాసనమండలి సభ్యుడిని.. రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇంత జ‌రుగుతుంటే ప్రభుత్వంలో కొనసాగాలని కోరుతుంటే ఎలా కొనసాగాలన్నారు. త‌న కార్యకర్తల హక్కులను కాపాడలేకపోతున్నాన‌న్నారు. కాంగ్రెస్‌ కార్యకర్త బలైతే సంయమనం పాటించమంటారా? అని జీవన్‌రెడ్డి ప్ర‌శ్నించారు.

Leave a Reply