మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంపును ఉపయోగించుకోవాలి..

మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంపును ఉపయోగించుకోవాలి..
వైద్యాధికారిణి సహిస్తా ఫిర్దోస్
నిజామాబాద్ జిల్లా,రెంజల్, ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా స్థానిక ఆస్పత్రిలో ఈనెల 28న మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారిణి డాక్టర్ సహిస్తా ఫిర్దోస్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలు,ఆశా వర్కర్లుతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…స్త్రీ వైద్య, పిల్లల వైద్య,కీళ్ల ఎముకల వైద్య, జనరల్ మెడిసిన్,డెంటల్ కంటి వైద్య నిపుణులు వస్తున్నట్లు ఈ శిబిరానికి వచ్చే వైద్యులు పలు సూచనలు,సలహాలు ఇస్తారని వాటిని అనుసరించి జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు శిబిరం కొనసాగుతుందని అన్నారు.గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో వైద్య అధికారి డాక్టర్ సుధాకర్,విస్తీర్ణధికారులు కరిపే రవీందర్,తోట సురేష్,సూపర్వైజర్ మాలంబి, ఎంఎల్హెచ్పి ప్రమోదిత,లక్ష్మీనారాయణ, ఆరోగ్య కార్యకర్తలు,ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
