ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్ బదిలీ

ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్ బదిలీ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ సీఐ డి.చంద్రశేఖర్ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. మైలవరం సీఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఈ నెల 10న బదిలీపై ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించారు.
పట్టుమని పది రోజులు గడిచాయో లేదో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీ అయిన ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ సీఐ స్థానంలో ఎవరినీ నియమించలేదు.
