ఉపాధ్యాయ శిక్షణ తరగతులకు హాజరైన బీజేపీ కార్యకర్తలు..

ఉపాధ్యాయ శిక్షణ తరగతులకు హాజరైన బీజేపీ కార్యకర్తలు..

రేగొండ, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రేగొండ మండలంలోని ఎస్ఎల్ఎన్. ఫంక్షన్ హాల్‌లో రేగొండ, గోరికొత్తపల్లి, శాయంపేట మండలాల సంయుక్త ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్–2026 శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించబడినవి. ఈ కార్యక్రమం పార్టీ శక్తివంతమైన సంస్థాగత నిర్మాణానికి, సైద్ధాంతిక బలోపేతానికి కీలక వేదికగా నిలిచింది.ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి కార్యకర్తలకు సమగ్ర మార్గదర్శనం చేస్తూ, పార్టీ సిద్ధాంతాలు, కార్యాచరణ, ప్రజా సేవా దృక్పథంపై విస్తృతంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ.. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన “ఏకాత్మ మానవ దర్శనం” బీజేపీ యొక్క ప్రాథమిక సిద్ధాంతమని తెలిపారు.

1965లో ఆయన ప్రవేశపెట్టిన ఈ సిద్ధాంతం మనిషిని కేవలం ఆర్థిక కోణంలో కాకుండా, శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మల సమగ్ర సమన్వయంగా చూడాలని సూచిస్తుందని వివరించారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న “అంత్యోదయ” భావనను ప్రతి కార్యకర్త తన ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.భారతీయ జనతా పార్టీ యొక్క సైద్ధాంతిక పునాదులు అయిన హిందుత్వ, సాంస్కృతిక జాతీయవాదం, జాతీయ సమగ్రత, సామాజిక న్యాయం, ఆర్థిక సమతుల్యత వంటి అంశాలపై కార్యకర్తలకు సవివరంగా వివరించారు. ఈ సిద్ధాంతాలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా సమాజ అభ్యున్నతికి దోహదపడే మార్గదర్శకాలని పేర్కొన్నారు.పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో, నిబద్ధతతో, సేవాభావంతో పనిచేస్తేనే పార్టీ బలపడుతుందని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా కృషి చేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ బలపడటానికి శిక్షణ తరగతులు అత్యంత కీలకమని తెలిపారు.

నాడు పండిట్ దీన్ దయాళ్ చూపిన దార్శనికతే నేడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలనకు, సంక్షేమ కార్యక్రమాలకు ప్రధాన మార్గదర్శకంగా నిలుస్తోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్నీ “అంత్యోదయ” స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నాయని వివరించారు. అలాగే 1953లో ప్రారంభమైన క్రమశిక్షణాయుత శిక్షణా సంప్రదాయం నేటికీ బీజేపీకి అతిపెద్ద సంస్థాగత బలం అని, అదే పార్టీ విజయాలకు మూలకారణమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని, పార్టీ అభివృద్ధికితోడ్పడాలనిపిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు. నాగపురి రాజమౌళి గౌడ్, రాష్ట్ర నాయకులు. వెన్నంపెళ్లి పాపయ్య, చదువు రామచంద్ర రెడ్డి, మాజీ కార్యవర్గ సభ్యులు.

జన్నే మొగిలి, పార్లమెంట్ కో కన్వీనర్. లింగంపల్లి ప్రసాద్ రావు, రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్. రాయరాకుల మొగిలి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు. పోల్సాని తిరుపతిరావు, జిల్లా ఉపాధ్యక్షులు. దాసరి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి. పెండల రాజు, మండల అధ్యక్షులు. బండి శ్రీనివాస్,రామకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి. దయ్యాల కిరణ్, గన్రెడ్డి లింగారెడ్డి, కనిపర్తి ఉపసర్పంచ్. గుర్రం రమేష్,బీజేవైఎం.నాయకులు మాత శంకర్, కౌడగాని రాకేష్, బిజెపి మండల ఉపాధ్యక్షులు. ఎల్లవుల రాజు, ఏరాబటి శివ,సర్వు కుమార్, మండల కోశాధికారి. పింగిలి రవీందర్ రెడ్డి, మండల నాయకులు సాదు దేవేందర్, రమేష్,బానోత్ రాజేందర్,నాయకులు. నాయకులు బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply