దామగుండం ఆలయంలో..

దామగుండం ఆలయంలో..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన దామగుండం శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శుక్రవారం ఉదయం అగ్నిగుండం ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండం అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే.. చుట్టూ నీరు మధ్యలో లింగం ఉంటుంది. దీంతో ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఏర్పడింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తుంటారు. దామగుండం రామలింగేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించడం ద్వారా మంచి జరుగుతుందన్న ప్రగాఢ విశ్వాసం ప్రజల్లో నెలకొని ఉంది.

Leave a Reply