నకిలీ యాప్‌ల నుండి రక్షించుకోడం ఎలా

నకిలీ యాప్‌ల నుండి రక్షించుకోడం ఎలా
హైదరాబాద్, ఆంధ్రప్రభ : 2024లో భారతదేశంలో దాదాపు 36 లక్షల సైబర్-మోసం ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటి నష్టం రూ. 22,845 కోట్లు అని అంచనా. రిపోర్ట్ చేసిన సైబర్ భద్రతా సంఘటనలు 2022లో దాదాపు 10.29 లక్షల నుండి 2024లో దాదాపు 22.68 లక్షలకు రెట్టింపు అయ్యాయి. ఈ గణాంకాలు పెరుగుతున్నా ఈ ఆందోళనకర పరిస్థితిపై తక్షణమే దృష్టి సారించి, ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.
APK (ఆండ్రాయిడ్ ప్యాకేజీ ఫైల్) అనేది ఆండ్రాయిడ్ ఫోన్‌లలో యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి ఉపయోగించే ఫైల్. ఇది Google Play Store, Apple App Store లేదా Indus App Store వంటి అధికారిక యాప్ స్టోర్ వెలుపల నుండి యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కొన్నిసార్లు సరైన కారణాల కోసం ఉపయోగించినప్పటికీ, ఈ ఫైళ్లు అధీకృత యాప్ స్టోర్‌లలోని యాప్‌లకు వర్తింపజేసే భద్రతా తనిఖీలను దాటవేస్తాయి. ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవచ్చు.
సాధారణంగా బాధితులుగా అయ్యే వారు ఎవరంటే… ఎక్కువ యాప్‌లను ఉపయోగించి, తరచుగా లావాదేవీలు చేసే ఉద్యోగులు, అధికారికంగా కనిపించే ఏ మెసేజ్ అయినా నమ్మే అవకాశం ఉన్న వృద్ధులు లేదా టెక్నాలజీ గురించి తక్కువ తెలిసిన యూజర్లు, సోర్స్‌ని చెక్ చేయకుండా “ఫ్రీ” యాప్‌లు లేదా గేమ్ అప్గ్రేడ్ల కోసం వెతికే యువత. ఈ స్కామ్‌లు తరచుగా చాలా చిన్న విషయాలతో మొదలవుతాయి. వాట్సాప్ లేదా టెలిగ్రామ్‌లో ఒక లింక్, ‘చలాన్’ కట్టలేదని చెప్పే SMS, లేదా OTT సబ్‌స్క్రిప్షన్ వంటి ప్రీమియం సేవలకు “ఫ్రీ అప్‌గ్రేడ్” ఆఫర్ చేసే మెసేజ్.
మీరు ఒక్కసారి దానిపై ట్యాప్ చేస్తే చాలు, మీకు తెలియని వ్యక్తికి మీ ఫోన్ నియంత్రణ అప్పగించినట్లే. మోసగాళ్లు సాధారణంగా ఈ స్పష్టమైన క్రమాన్ని అనుసరిస్తారు. ముందుగా వారు రివార్డు, లోన్ లేదా పెనాల్టీ మాఫీని వాగ్దానం చేస్తూ లింక్ లేదా SMSని పంపుతారు. ఆ లింక్‌ని క్లిక్ చేస్తే అధికారిక యాప్‌స్టోర్ నుండి ఇన్‌స్టాల్ కావడానికి బదులుగా ఆ లింక్ నేరుగా ఒక నకిలీ యాప్‌కు సంబంధించిన APK డౌన్‌లోడ్‌కు దారితీస్తుంది. ఒక ప్రాంప్ట్ మీ ఫోన్‌లో అనవసరమైన అనుమతులను అడుగుతుంది. (SMS, కాంటాక్ట్‌లు, నోటిఫికేషన్‌లు మొదలైనవి చూడటానికి). నకిలీ యాప్ కనిపించేలా ఏమీ చేయదు లేదా క్రాష్ అవుతుంది – అదే సమయంలో మాల్‌వేర్ నిశ్శబ్దంగా పనిచేస్తుంది.
తద్వారా మీ OTPలు చోరీ చేయడం, స్క్రీన్ రికార్డింగ్, బ్యాంక్ అకౌంట్ వివరాల సేకరణ, స్క్రీన్‌పై వచ్చే అలెర్ట్లని డిలీట్ చేయడం జరుగుతుంది. యూజర్‌కి అనధికారిక లావాదేవీలు జరిగాక అకౌంట్ నుండి డబ్బు మాయమయ్యాక మాత్రమే మోసం జరిగిందని అర్థమవుతుంది. యూజర్లు ఇటువంటి మోసాల బారిన పడకుండా రక్షించడానికి ఫోన్‌పే సైబర్ భద్రతా నిపుణులు కొన్ని కీలకమైన చిట్కాలను పంచుకుంటున్నారు.
మీరు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు:
- Indus Appstore వంటి అధికారిక యాప్ స్టోర్‌కు బదులుగా SMS లేదా వాట్సాప్ లేదా మరేదైనా థర్డ్ పార్టీ యాప్ ద్వారా డౌన్‌లోడ్ లింక్ రావడం.
- యాప్‌కు సంబంధం లేని అనుమతులను అడగడం (ఉదాహరణకు: మీ కాంటాక్ట్‌లు లేదా మెసేజ్‌లను చదవడానికి అనుమతి అడుగుతున్న ఫ్లాష్‌లైట్ యాప్).
- తప్పుగా రాసినట్లు, కొత్తగా లేదా అనుమానాస్పదంగా కనిపించే డెవలపర్ పేర్లు.
- నమ్మశక్యం కాని ఆఫర్‌లు లేదా మెసేజ్‌లు (“ఫ్రీ ప్రీమియం”, “తక్షణ లోన్ అప్రూవల్”,మొదలైనవి).
- యాప్ అతి తక్కువ డౌన్‌లోడ్‌లు, సాధారణ బ్రాండింగ్ లేదా తక్కువ యూజర్ రివ్యూలను కలిగి ఉండటం.
అధికారిక స్టోర్ల (Indus App Store/Google Play/Apple App Store) నుండి మాత్రమే యాప్‌లను ఇన్‌స్టాల్ చేయమని, ఇంకా మీరు ఏమి డౌన్‌లోడ్ చేస్తున్నారో ఖచ్చితంగా తెలియకపోతే “తెలియని యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి”ని డిసేబుల్ చేసి ఉంచామని నిపుణులు సూచిస్తున్నారు. మీరు అనుకోకుండా వచ్చే చలాన్‌లు, రీఫండ్‌లు, రివార్డ్‌లు లేదా లోన్‌లకు సంబంధించిన లింక్‌లు/ఫైల్‌లను ట్యాప్ చేయకుండా ఉండాలి.
యాప్‌లు అడిగే అనుమతులు ఎనేబుల్ చేసే ముందు వాటిని సమీక్షించడం చాల ముఖ్యం. హానికరంగా అనిపించే ప్రవర్తన కోసం స్కాన్ చేయడానికి నమ్మదగిన మొబైల్ సెక్యూరిటీ టూల్‌ను ఎల్లప్పుడూ ఉపయోగించండి. మీరు అనుకోకుండా నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే వెంటనే ఆ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. తాత్కాలికంగా మొబైల్ డేటా, Wi-Fiని ఆఫ్ చేయండి. బ్యాంకింగ్, ఇమెయిల్ & పేమెంట్ యాప్‌లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను మార్చండి. మీ బ్యాంక్/పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించి, మానిటరింగ్‌ను ఎనేబుల్ చేయమని లేదా యాక్టివిటీని ఫ్రీజ్ చేయమని కోరండి.
ఫోన్‌పేలో మీరు అలాంటి మోసానికి గురైతే, వెంటనే ఫోన్‌పే యాప్‌లో లేదా కస్టమర్ కేర్ నంబర్లు 080–68727374 / 022–68727374కు కాల్ చేసి లేదా ఫోన్‌పే అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అటువంటి స్కామ్‌ల గురించి ఫిర్యాదు చేయవచ్చు. చివరగా, మీరు సమీపంలోని సైబర్ క్రైమ్ సెల్‌కు వెళ్లి మోసం గురించి ఫిర్యాదు చేయవచ్చు లేదా https://www.cybercrime.gov.in/కు వెళ్లి, ఆన్‌లైన్‌లో ఫిర్యాదును నమోదు చేయవచ్చు లేదా 1930కు కాల్ చేసి సైబర్ క్రైమ్ సెల్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్‌లు లేదా వాట్సప్ మోసం గురించి సంచార్ సాథీ పోర్టల్‌లోని చక్షు సౌకర్యంలో సమాచారమివ్వడం ద్వారా మీరు టెలికమ్యూనికేషన్స్ శాఖను (DOTను) కూడా సంప్రదించవచ్చు. మీరు ఫోన్‌పే ఫిర్యాదుల పరిష్కార విభాగంలో కూడా ఫిర్యాదు చేయవచ్చు.
