సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్

లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ ; మండలంలోని పాత కొమ్ముగూడెంలో ఆదివారం ఎన్ఆర్జీఎస్ నిధులతో నూతన సీసీ రోడ్డు పనులను ఆ గ్రామ సర్పంచ్ దుమ్మని సత్యన్న టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దుమ్మని సత్యన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆశీస్సులతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామంలో అన్ని వీధుల్లో రాబోయే రోజుల్లో సీసీ రోడ్లు నిర్మించేలా కృషి చేస్తామని తెలిపారు. ఎన్ఆర్జీఎస్ ద్వారా మంజూరైన రూ. 7.50 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మిస్తున్నట్లు వివరించారు.

గ్రామంలో డ్రైనేజ్, వీధి దీపాలు, పరిశుభ్రత, రోడ్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి పౌరుడు బాధ్యతయుతముగా నడుచుకున్నప్పుడే మంచి సమాజ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బేక్కం సృజన్, నాయకులు భైరం రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply