ప్రజల శ్రేయస్సు దృష్ట్యా..

ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ..

బాపులపాడు, ఆంధ్రప్రభ : విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కృష్ణాజిల్లా బాపులపాడు డిప్యూటీ ఎంపీడీవో లక్ష్మయ్యను విధులు నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జె.అరుణ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. పన్నులు, నాన్-పన్నుల వసూళ్లలో కేవలం 21.8% మాత్రమే పురోగతి సాధించడం శాఖపరమైన సమీక్షా సమావేశాలకు గైర్హాజరు అవ్వడమే కాకుండా ప్రజలకు తాగునీరు అందించే ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల శుభ్రపరచడం, క్లోరినేషన్ పనుల్లో కూడా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించడంతో జిల్లా కలక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందన్నారు.

Leave a Reply