ఆకట్టుకున్న విద్యార్థుల విద్యాబోధన

విద్యార్థులు కష్టపడి చదవాలి
గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఘనంగా స్వయంపాలన దినోత్సవం
స్టేషన్ ఘన్ పూర్ , ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహిం చారు. ఒకరోజు పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు తమ దైనశైలిలో పాఠాలు బోధించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా ఉపాధ్యాయుల మాదిరిగా తయారై తరగతి గదులలో చక్కటి టీచింగ్ లెర్నింగ్ మెటీరి యల్ ఉపయోగించి పాఠ్యాంశాలను బోధించారు.
విద్యార్థులు వాటిని శ్రద్ధగా విన్నారు. నేటి విద్యార్థి ఉపాధ్యాయుల బోధనను ఉపాధ్యా యులు పరిశీలించారు. ఒకరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించడం ద్వారా విద్యార్థులకు ఉపాధ్యాయుల యొక్క బాధ్యతలు తెలియడం కోసం భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా రావడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని సూచించారు.
పాఠశాలలో ఒక రోజు విద్యార్థులే ఉపాధ్యాయుల అయినా సందర్భంగా హెచ్ఎం కే.చందన, ఏటిడిఓ గా భూమిక, డిటిడిఓ గా స్వప్న, ఏసీఏంఓ గా నందిని, కలెక్టర్ గా హద్విత, ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఐశ్వర్య, ఆర్డీఓగా ఏ. కీర్తన, డీఈఓ గా ఏం. స్వాతి, ఎస్ ఓ గా రాధిక, ఎంఈఓ గా బి. హారిక, హెచ్ డబ్ల్యూఓ గా జె. రజిత, ఉపాధ్యాయయినిలుగా రమాబాయ్, అంకిత, అంజలి, అలాగే పాఠశా ల ఉపాధ్యాయులు బి. వాసు, పార్వతి బాయి, బి. దశరథ్, సుమలత, బి. చంద్రం, శ్రీమతి, పద్మ,మాన్య, మల్లు, వీరన్న, సుజాత, కల్పన, సునీత, అనిత,తదితరులు పాల్గొన్నారు.
