Kadem | గంగాపూర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఖానాపూర్ ఎమ్మెల్యే

Kadem | గంగాపూర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఖానాపూర్ ఎమ్మెల్యే
Kadem (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం మండలంలోని గంగాపూర్ బ్రిడ్జి పనులను నిర్మల్ డిసిసి అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెప్ప పై వెళ్లి పనులను పరిశీలించారు. త్వరతిగతిన, నాణ్యతతో, పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ గ్రామానికి రోడ్లు బ్రిడ్జిలు ప్రజల సౌకర్యకార్థం వేస్తున్నాం అని.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఆయన వెంట ఖానాపూర్ ఏ ఎంసీ చైర్మన్ పి. భూషణ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
