భక్తులకు అన్నప్రసాద వితరణ..

మర్రిగూడ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో గత మూడు రోజులుగా జరుగుతున్న శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో బాగంగా మంగళవారం రథ సప్తమి కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులకు అన్నదాన కార్యక్రమంను మాజీ సర్పంచ్ మాస నీలిమచంద్రశేఖర్, కర్నాటి రామయ్య రాజమణిల ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమంను ఏర్పాటు చేశారు.
భక్తులకు వీరు గత పదకొండు సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమంను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పొనుగోటి శేఖర్, నాయకులు ఎండి గౌస్, పంపు వెంకటయ్య, డి.సైదులు, పొనుగోటి భాస్కరరావు, చిలివేరు మహేష్, సిలివేరు శ్రీను, ఎడ్ల ముత్య, నీల శంకర్, ఎల్వి శర్మ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
