కాంగ్రెస్ లో చేరిక..

వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన నేతావత్ శిభారాణి–రాజేందర్ ఆదివారం వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నేతావత్ శిభారాణి–రాజేందర్ మాట్లాడుతూ.. 5వ వార్డు ప్రజల ఆదరణతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తాను, నా సొంత పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలో మా స్థానిక ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో మంత్రి ద్వారా పార్టీలో చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. వార్డు అభివృద్ధి మరింత వేగంగా జరగాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.

5వ వార్డు పరిధిలోని తండాలు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం ప్రజలందరికీ నేను ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అందించాలనే గొప్ప సంకల్పంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరాము. ప్రజల ఆశలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని, అందరి సహకారం కోరుతూ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ. అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతావత్ శిభారాణి–రాజేందర్ కి స్వాగతం పలికారు. వార్డు అభివృద్ధికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షడు మహమ్మద్ అయూబ్, బండి చైతన్య రెడ్డి, 5వ వార్డు కాంగ్రెస్ నాయకులు రాందాన్ నాయక్, బావుసింగ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply