వర్ధన్నపేట మున్సిపాలిటీ ముందు టీఆర్ఎస్ నాయకుల ధర్నా…

వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలలో గందరగోళంగా మారింది. 12 వ వార్డులో టిఆర్ఎస్ గెలిచిన కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆర్వో, అధికారులు గందరగోళం చేసి సంతకాలు చేయించారని, టిఆర్ఎస్ నాయకులు వర్ధన్నపేట మున్సిపాలిటీ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఆర్ఓ డాం, డాం అని వర్ధన్నపేట మున్సిపల్ ఆఫీస్ నందు ధర్నాకు కూర్చున్నారు. మున్సిపాలిటీ ముందు వరంగల్ నుండి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపై వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నాగూర్ల వెంకటేశ్వర్లు టిఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ… 12వ వార్డు రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టి రేకౌంటింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆరూరి రమేష్ కోరారు…

Leave a Reply