Temple | బయటపడిన దేవుని మహిమ…

Temple | బయటపడిన దేవుని మహిమ…
Temple | రాప్తాడు, ఆంధ్రప్రభ : భగవంతుడు ఉన్నాడు అనేందుకు మన కళ్ళ ఎదురుగా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగానే రాప్తాడు మండల పరిధిలోని ఎర్రగుంట గ్రామంలో శ్రీ నారాయణ స్వామి దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో పాల పొంగులు పరుష అన్నదానం కార్యక్రమాలు గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహిస్తారు. మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా వేళల్లో భక్తులు మొక్కుబడులు తీర్చుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 15న శ్రీ నారాయణ స్వామి పాలకొంగులు నిర్వహించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. అందుకు గుడి దగ్గర చేపట్టాల్సిన కార్యక్రమాలు ప్రారంభించారు.అందులో భోజనాలు చేసే చోట వంట పొయ్యిలు ఏర్పాటు చేసేందుకు మట్టిని తవ్వగా అక్కడ అగ్గి నిప్పులు ప్రత్యక్షమయ్యాయి.

గత సంవత్సరం పూడ్చిపెట్టిన పోయ్యలో నిప్పులు కనిపించడంతో గ్రామ ప్రజలు శ్రీ నారాయణ స్వామి తమ గ్రామంలో ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని సంతోషపడుతున్నారు. దేవుడు ఉన్నాడు అనేందుకు ఇది ఒక నిదర్శనం. గ్రామంలో ఈనెల 15న శ్రీ నారాయణ స్వామి పాల పొంగులు పరుష అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామ పెద్దలు తెలియజేశారు.
click here to read more : 10th century | దేవేరి కామాక్షి, బ్రహ్మ, విష్ణువులతో….
