Mla | కూటమి పాలన, స్వర్ణాంధ్ర సాధనకు బలమైన పునాదులు

Mla | కూటమి పాలన, స్వర్ణాంధ్ర సాధనకు బలమైన పునాదులు
20 నెలల్లో కూటమి పాలన, స్వర్ణాంధ్ర సాధనకు బలమైన పునాదులు
పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
Mla | అమరావతి, ఆంధ్రప్రభః కూటమి ప్రభుత్వంఅధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తైన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలో చారిత్రక విజయాలు సాధించామని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పేర్కొన్నారు. అనేక సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను పునరుద్ధరించి ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని ఆయన తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు తల్లికి వందనం పథకం ద్వారా రూ.10,090 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేసి 67.27 లక్షల మంది విద్యార్థులకు మద్దతు అందించామని తెలిపారు. స్త్రీ శక్తి పథకం కింద 5 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించి రూ.1,513 కోట్లు వ్యయం చేశామన్నారు.
దీపం పథకం ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తూ ఇప్పటివరకు 3.64 కోట్ల సిలిండర్లు పంపిణీ చేసి రూ.2,891 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.అన్నదాత సుఖీభవ పథకం కింద 46 లక్షల రైతులకు రెండు విడతల్లో రూ.6,310 కోట్లు జమ చేశామని, ఎన్టీఆర్ భరోసా ద్వారా ప్రతి నెలా 63 లక్షల మందికి పింఛన్లు అందిస్తూ ఇప్పటివరకు రూ.58,654 కోట్లు వ్యయం చేసి దేశంలోనే రికార్డు సాధించామని చెప్పారు. సమాజంలోని ప్రతి వర్గానికి అండగా ప్రభుత్వం మత్స్యకార భరోసా, నేతన్నలకు ఉచిత విద్యుత్, ఆటో డ్రైవర్లకు వార్షిక సాయం, అన్న క్యాంటీన్ల ద్వారా కోట్లాది భోజనాలు, గీత కార్మికులు, స్వర్ణకారులు, పాస్టర్లు, ఇమాములు, మౌజన్లు, అర్చకులు, నాయీ బ్రాహ్మణులు, జూనియర్ లాయర్లకు గౌరవ వేతనాలు అమలు చేస్తూ సమగ్ర సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని భాష్యం ప్రవీణ్అన్నారు.
విద్య,ఉద్యోగాలు,భద్రత మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టుల భర్తీ, 5,757 కానిస్టేబుల్ నియామకాలు పూర్తి చేయడం, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు, బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు వంటి చర్యలు ప్రజలపై ప్రభుత్వ బాధ్యతను చాటుతున్నాయని పేర్కొన్నారు.అభివృద్ధి,పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టి విశాఖ సీఐఐ సమ్మిట్, ఎస్ఐపీబీ సమావేశాలు, గూగుల్ ఎఐ డేటా సెంటర్, ఐటీ హబ్స్, క్వాంటం వ్యాలీ, గ్రీన్ అమోనియా ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఉద్యోగాలకు బాటలు వేసినట్టు తెలిపారు. పరిశ్రమలు, పర్యాటక రంగానికి ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగామారిందన్నారు.మౌలిక వసతులు, నీటి భద్రత రోడ్లు, రహదారులు, గ్రామీణ మౌలిక వసతులు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, అమరజీవి జలధార, సాగునీటి ప్రాజెక్టుల వేగవంతమైన పనులు, పోలవరం నిర్మాణంతో రైతాంగానికి భరోసా కల్పించామని చెప్పారు.విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా మూడు రీజియన్ల అభివృద్ధి, కేంద్ర పథకాల సద్వినియోగం, జాతీయ రహదారి,రైల్వే ప్రాజెక్టులు, కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలనను ప్రజలకు చేరువ చేస్తున్నామని భాష్యం ప్రవీణ్ తెలిపారు.సంక్షేమం,అభివృద్ధి,సుపరిపాలనతో ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా భాష్యం ప్రవీణ్ స్పష్టం చేశారు.
