Farewell meeting | క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ఉత్తమ ఫలిలు..

Farewell meeting | క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ఉత్తమ ఫలిలు..

  • ఇన్ స్పైర్ జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు ససమావేశం

Farewell meeting | హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు లక్ష్య సాధన దిశగా నిరంతరంగా కృషి చేస్తూ,ఉత్తమ ఫలితాలను సాధించాలని ఇన్ స్పైర్ కళాశాల చైర్మన్ తీగల భరత్ గౌడ్ అన్నారు. హనుమ కొండ జిల్లా హసన్ పర్తిలో స్థానిక ఎంటిఆర్ గార్డెన్ ఫంక్షన్ హాలులో బుధవారం ఇన్ స్పైర్ జూనియర్ కళాశాల 2025-2026 అకాడమిక్ ఇయర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన భరత్ గౌడ్ ఈమాట్లాడుతూ ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే తప్పకుండా విజయం సాధించగలరని అన్నారు.విద్యార్థి దశలో అన్ని నైపుణ్యాలను సాధించి, భవిషత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ సుంకరి శ్రీరాంరెడ్డి మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పోటీ పరీక్షలకు అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా కళాశాల యజమాన్యం నిరంతర కృషి చేస్తుందని వివరించారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకొని పట్టుదలతో చదువుకుంటే తప్పకుండా విజయం సాధించగలరని సూచించారు.

విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా కళాశాల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకొని పట్టుదలతో చదువుకుంటే తప్పకుండా విజయం సాధించగలరని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు తీగల రాజకుమార్, కోటిచింతల మమత కుమారి, లాడే శివ. అలాగే కళాశాల అధ్యాపకులు పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు.వీడ్కోలు సమావేశం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం కళాశాల యాజమాన్యం విద్యార్థులను సన్మానించి,అభినందించారు. ఈ సమావేశం ఉత్సాహభరితంగా, ఆత్మీయ వాతావరణంలో ముగిసింది.

Leave a Reply