TG | నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..

TG | నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి..
(ఓపీడీఆర్) రాష్ట్ర కమిటీ సభ్యులు అంబాల మహేందర్, సునీత పిలుపు
TG | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి మౌలిక బాధ్యత అని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపీడీఆర్) రాష్ట్ర కమిటీ సభ్యులు అంబాల మహేందర్, సునీత పేర్కొన్నారు. “ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణం. ప్రతి ఓటుతోనే దేశ భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది. అందుకే ప్రతి పౌరుడు ముందుకు వచ్చి ఓటు వేయడం ద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి” అని వారు పిలుపునిచ్చారు.
