Ballot boxes | ఎన్నికలకు సర్వం సిద్ధం

Ballot boxes | ఎన్నికలకు సర్వం సిద్ధం
- భారీ బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్‌లు తరలింపు
- పోలింగ్ బాక్స్‌ల్లో అభ్యర్థుల భవితవ్యం
Ballot boxes | స్టేషన్‌ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీలో నేడు(బుధవారం) జరగనున్న మున్సిపల్ ఎన్ని కలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు విస్తృ త ఏర్పాట్లు చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్స్‌లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. మున్సిపాలిటీలో మొత్తం 18,550 మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళలు 9,636, పురు షులు 8,913 మంది ఉన్నారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 82 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 18 వార్డులు ఉండగా, వార్డు కౌన్సిలర్ స్థానాల కోసం అధికార పార్టీ కాంగ్రెస్ నుంచి 18 మంది, బీఆర్ ఎస్ నుంచి 18 మంది, బీజేపీ నుంచి 13 మంది, సీపీఐ, బీఎస్పీ, జనసేనతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 82 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 3 రూట్లు, 36 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు మొత్తం 220 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు.
ఇందులో 44 మంది పీఓలు, 44 మంది ఏపీఓలు, 132 మంది ఓపీలు ఉండగా, అదనంగా రిజర్వ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. భద్రతా పరంగా ఎలాంటి అవాం ఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు లోనుకా కుండా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
