3,680 Government | విద్యారంగ సమస్యల పరిష్కారానికి…

3,680 Government | విద్యారంగ సమస్యల పరిష్కారానికి…
- యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి
- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్
3,680 Government | కరీమాబాద్, ఆంధ్రప్రభ : విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల ఉద్యమాలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఈ రోజు వరంగల్ బస్ స్టాండ్ రోడ్డులోని గిర్మాజిపేట గాంధీ భవన్ లో ఏఐఎస్ఎఫ్ వరంగల్ జిల్లా 26వ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలకు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పార్థసారథి అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అందరికీ విద్య పేరుతో కొందరికే విద్యను పరిమితం చేసిన ఘనత మన పాలకులదని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో నెలకొన్నసమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యను పూర్తిగా దూరం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నూతన జాతీయ విద్యావిధానం-2020 పేరుతో విద్యా కార్పొరేటికరణ, విద్యాకేంద్రీకరణ, కాషాయికరణ చేయాలని చూస్తుందని విమర్శించారు.
రాష్ట్రంలో రేషనలైజేషన్ పేరుతో 3,680 ప్రభుత్వ పాఠశాలల మూసివేయాలని చూస్తున్నారని, విద్యాసంస్థలు ప్రారంభమై ముగింపు దశకు వచ్చిన విద్యార్థులకు న్యాయమైన వసతులు కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి ల్యాదాళ్ళ శరత్, జిల్లా కమిటీ సభ్యులు శివ కుమార్ పవన్ అభిరామ్ శ్రేయాస్ ప్రభాస్ రాజు సంతోష్ రాకేష్ నిఖిల్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
