ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్..

ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్..
ఎమ్మెల్యే సహకారంతో వార్డు అభివృద్ధి
సొంత నిధులతో పేదలకు సహాయం చేస్తాను
19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మధుసూదన్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 19వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పిల్లలమర్రి మధుసూదన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డులోని ప్రతి ఇంటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో వార్డులోని ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని మధుసూదన్ హామీ ఇస్తున్నారు.
వార్డులో ఇప్పటి వరకు ఉన్న కౌన్సిలర్ ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని, అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని కౌన్సిలర్ గా గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు గుర్తించాలని మధుసూదన్ కోరారు. తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని, తన సొంత నిధులతో ప్రతి పేద ఆడబిడ్డ వివాహానికి రూ. 10 వేలు, ప్రతి పేద మహిళ డెలివరీ కోసం రూ. 10వేలు, ప్రతి పేద కుటుంబానికి ఆస్పత్రి వైద్య సహాయం కోసం రూ. 10వేలు ఆర్థిక సహాయం చేస్తానని, పీర్ల కొట్టం వద్ద వాటర్ ఫిల్టర్ ను ఏర్పాటు చేయిస్తానని, విద్యుత్తు తదితర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని మధుసూదన్ వార్డు ప్రజలకు హామీ ఇస్తూ 19వ వార్డులో మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ ప్రచారంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
