Venkatachalam | టోల్ గేట్ వ‌ద్ద కారులో భారీగా బంగారం ప‌ట్టివేత ..

వెంకటాచలం, (నెల్లూరు) మార్చి 12(ఆంధ్రప్రభ) : బంగారం వ్యాపారులు ప్రభుత్వానికి రావలసిన ఆదాయానికి భారీ గండి కొడుతున్నారు. నెల్లూరులోని బంగారం దుకాణాలకు చెన్నై నుండి బంగారం వస్తుంది. అయితే బంగారం నెల్లూరుకు రావాలంటే బిల్లులు ఉండాలి. బిల్లులు ఉంటే జీఎస్టీ చెల్లించాలి. అయితే ఈ జీఎస్టీ భారీ మొత్తంలో ఉంటుంది. దీన్ని దిగమింగడానికి నెల్లూరు వ్యాపారులు చెన్నై నుండి ఎటువంటి బిల్లులు లేకుండా పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నారు.

దీంతో విజిలెన్స్ అధికారులు ఈ దండాపై దృష్టి పెట్టారు. వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులకు వచ్చిన సమాచారంతో సోమవారం నెల్లూరు విజిలెన్స్ ఎస్పీ రాజేంద్ర కుమార్ ఆదేశాల మేరకు సీఐలు నరసింహారావు, కె. విష్ణు రావు, డీసీటీఓ సిబ్బందితో కలసి వెంకటాచలం టోల్ గేట్ వద్ద వాహన తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా ఏపీ 39 కెపీ 2728 నెంబరు గల కారులో 4.189 కిలోల బంగారు ఆభరణాలు నెల్లూరుకు తరలిస్తున్నట్లు గుర్తించారు.

దీంతో కారుతో పాటు బంగారాన్ని సీజ్ చేసి జీఎస్టీ అధికారులకు అప్పగించారు. కాగా బంగారం విలువ రూ.3,37,21,450.00 లు విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బంగారం రవాణా చేస్తున్న నెల్లూరుకు చెందిన హర్ష జైన్, అన్న రాం, నల్లారి రంజిత్ కుమార్ లను అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *