TG | ల‌క్ష‌న్న‌ర కోట్లు అప్పు చేశారు..ఆ డ‌బ్బుకు లెక్కలు చెప్పండి: కవిత డిమాండ్


రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు.
తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని వ్యక్తి రేవంత్ రెడ్డి
గడిచిన 15 నెలల్లో 1,52,918 కోట్ల అప్పు తీసుకొచ్చారు.
వాటి ఖ‌ర్చ వివ‌రాలు చెప్పాల‌ని రేవంత్ రెడ్డికి క‌విత డిమాండ్
కేసీఆర్‌ తెచ్చిన అప్పులకు పూర్తి లెక్కలు చెబుతాము.

హైద‌రాబాద్ – తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడిచినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. 15 నెలల్లో రూ ఒక ల‌క్ష 50 వేల కోట్ల‌ అప్పు అంటూ ఆరోపించారు. తెలంగాణ భ‌వ‌న్ లో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ, ప్ర‌స్తుతం రాష్ట్రం రూ.1.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, వివాహం చేసుకునే మహిళలకు 10 గ్రాముల బంగారం, యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, రూ.4,000 పెన్షన్ వంటి కీలక వాగ్దానాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం సాధన కోసం భారత రాష్ట్ర సమితి పార్టీ పేగులు తెగేలా పోరాడిందని, అప్పటి కష్టం మరువలేనిదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కొన్ని సంవత్సరాల నిరంతర పోరాటం తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ పోరాటంలో కొంతమందికి మాత్రం ఎలాంటి పాత్రా లేదని ఆమె పేర్కొన్నారు. జరుగుతోందని, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ప్ర‌తినెల రూ. 18,800 కోట్లు ఉంటుందని ఆమె తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల రూ. 3,000 కోట్లు ఖర్చు చేస్తున్నదని అన్నారు.
గడిచిన 15 నెలల్లో 1,52,918 కోట్ల అప్పు తీసుకొచ్చారని, ఆ డబ్బులు ఎటు పోయాయో ప్రజలకు వివరించాలని కవిత డిమాండ్ చేశారు. కేసీఆర్‌ తెచ్చిన అప్పులకు పూర్తి లెక్కలు చెబుతామంటూ ఆమె స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *