Competitions | వాలీబాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక…

Competitions | వాలీబాల్ పోటీలకు విద్యార్థులు ఎంపిక…
Competitions | దండేపల్లి, ఆంధ్రప్రభ : ఈ నెల1న మంచిర్యాల జిల్లా జడ్.పి.హెచ్.ఎస్ బాలుర పాఠశాలలో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ వాలీబాల్ పోటీలలో దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో చదువుతున్న బిల్ల వినయ్, ఈ. అక్షిత, జి ప్రసన్న లు అత్యంత ప్రతిభ కనబరిచి ఈ నెల 5వ తేది నుండి 8 వ తేది వరకు నిజమాబాద్ జిల్లా కమ్మర్పల్లి లో జరగబోయే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక అయ్యారని పాఠశాల వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు గాజుల శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇంచార్జ్ మండల విద్యాధికారి మంత్రి రాజు, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రూపా చారి, ఉపాధ్యాయలు. సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్, ఉప సర్పంచ్ వినోద్,ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ఎస్ జి ఎఫ్ కార్యదర్శి ఎండి యాకూబ్, వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం నాయకులు కే రామ్మోహన్రావు సిరంగి గోపాల్, సూర సుదర్శన్, బండి రవి, ఫణి రాజాలు వారిని అభినందించారు .
