Lift irrigation | ధనార్జన కోసమే రాయలసీమ లిఫ్టు

Lift irrigation | ధనార్జన కోసమే రాయలసీమ లిఫ్టు
- రూ 1000 కోట్లు వైసిపి నేతల జేబుల్లోకి వెళ్లాయి
- వైసీపీవీ డైవర్షన్ పాలిటిక్స్
- రాయలసీమ అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం
- నంద్యాల జిల్లా అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య
Lift irrigation |జూపాడు బంగ్లా, ఆంధ్రప్రభ : గత వైసీపీ ప్రభుత్వంలో ధనార్జన కోసమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారని నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య విమర్శించారు. పోతిరెడ్డిపాడు వద్ద చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ ప్రాజెక్టు మట్టి వర్కులు మాత్రమే పూర్తి చేశారని, రూ. 1000 కోట్ల రూపాయలు వైసీపీ నేతల జేబులోకి వెళ్లాయని ఆరోపించారు. 2021 లోనే రాయలసీమ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని తెలిపారు.
ప్రాజెక్టు నిలిచాక మూడేళ్ల పాటు వైసిపి ప్రభుత్వం ఉన్న కోర్టులో వాదించలేకపోయారని, రో 2.6 కోట్లు జరిమానా కూడా విధించడం జరిగిందని తెలిపారు. వైసిపివి డైవర్షన్ పాలిటిక్స్ అని, తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి సంఘటనలను పక్కదారి పట్టించేందుకే పోతిరెడ్డిపాడు పడ్డ ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు పైసా కూడా నిధులు ఇవ్వలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తా పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
రాయలసీమ అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేశికిరణ్ కు రెండు పంటలకు నిరందిస్తామని తెలిపారు. అందరినీ వా ద్వారా 2000 కి చెక్కల నుంచి 3850 కాల్వ సామర్థ్యాన్ని పెంచడం జరిగిందని, కేవలం 100 రోజుల్లోనే 785 కిలోమీటర్ల మేర పనులు చేయడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి నల్ల ఏ మందు చనిపోతే అప్పటి ముఖ్యమంత్రి పరామర్శించేందుకు కూడా వెళ్లలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తుంగభద్ర డ్యామ్ గేట్ కొట్టుకుపోతే ఐదు రోజుల్లోనే మరమ్మత్తులు చేయించడం జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి తుంగభద్ర గేట్లో అమర్త్యందుకు ఇరువు 55 కోట్లు విడుదల చేయించడం జరిగిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం లో అలగనూరు రిజర్వాయర్ కట్ట కుంగిపోతే పనులు చేపట్టలేదన్నారు. అప్పట్లో రూమ్ 3 కోట్లతో పూర్తయ్య పనులు ప్రస్తుతం 36 కోట్లకు చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం రైతుల అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులకు రెండు పంటలకు నీరు ఇచ్చి ఆదుకుంటుందని ఎమ్మెలు గౌరు చరిత గిత్త జయసూర్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు ప్రసన్నలక్ష్మి, నాయకులు గిరీశ్వర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, శ్రీనివాసులు, రమణారెడ్డి, పెద్దన్న, రవికాంత్, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
