Deputy CM | ఎందుకంటే..

Deputy CM | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అధిక ధరలకు మద్యం విక్రయించడంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు అందాయి. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి ఈ తరహా ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి.. అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్దమన్నారు. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తుందని చెప్పారు. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.
