MLA | మేడారంలో కుటుంబ సమేతంగా పూజలు…

MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ : మేడారంలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర వేడుకల్లో ఈ రోజు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలు, సామూహిక భక్తి చైతన్యం, సమష్టి ఆధ్యాత్మిక ప్రాభవానికి ప్రతీకమైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో అమ్మవారులను కుటుంబసమేతంగా దర్శించుకున్న వెడ్మ బొజ్జు పటేల్ పూజలు చేసి కోరిన కోరికలు తీర్చే ఆ వనదేవతల దీపాలతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని వెడ్మ బొజ్జు పటేల్ కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Leave a Reply