Tiryani | కేసీఆర్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా…

Tiryani | తిర్యాణి, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమ అరెస్టుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మండల కేంద్రంలోని స్థానిక కొమురం భీం చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ పై సిట్ విచారణ జరపడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిట్ విచారణ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. రైతు రుణమాఫీ రైతు భరోసా పథకాలను అమలు చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సిట్ విచారణ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీస్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు హనుమాడ్ల జగదీష్, మాజీ పిఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసిలు ఆత్రం చంద్రశేఖర్, వెడ్మా కమల నూతన బి ఆర్ ఎస్ పార్టీ సర్పంచులు, బిర్యాని ఉప సర్పంచ్ చేని కుమార్ మాజీ సర్పంచులు, నాయకులు గాయంగి మల్లేష్, ముత్యం రాజయ్య, మడావి గుణవంతురావ్ బుర్ర మధుకర్, తోట లచ్చన్న, అట్టం సుమన్, భీమల్ల దేవేందర్. బొడ్డు రవీందర్, అర్జున్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
