Issuance of orders | హ‌వ్వ‌.. ఇదేం ప‌ని!

Issuance of orders | హ‌వ్వ‌.. ఇదేం ప‌ని!

  • ఆస్ప‌త్రిలో అవినీతి అధికారులు
  • నిధుల దుర్వినియోగం
  • 11 మంది వైద్యాధికారులపై క్రమశిక్షణ చర్యలు
  • గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఘ‌ట‌న‌

Issuance of orders | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ ఏరియా ఆస్పత్రిలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన మెడికల్ సూపరింటెండెంట్ తోపాటు మరో 10 మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఫిబ్రవరిలో అవినీతి నిరోధక శాఖ ఆసుపత్రిలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో అధికారులు అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అభియోగాల నేపథ్యంలో వారిని విచారించి క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు.

నిందితుల్లో మెడికల్ సూపరింటెండెంట్ ఎస్.ఇందిరాదేవి, అసిస్టెంట్ డెంటల్ సర్జన్ డీఎం వేణుగోపాల్, సివిల్ సర్జన్స్ డి.యదిడియా, కేవీఎస్ సత్యనారాయణ, సీహెచ్ రాజ్ కుమార్, గట్టం లీనా, టి.సుదేశ్ కుమార్, పరిపాలనాధికారి ఎస్.నరసింహా రావు (రిటైర్డ్), నర్సింగ్ సూపరింటెండెంట్ ఎన్.పద్మజ (రిటైర్డ్), హెడ్నర్స్ సీహెచ్ విజయకుమారి (రిటైర్డ్), ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 బుదాటి విజయ్ కుమార్ ఉన్నారు. వీరికి అందిన నోటీసులకు 10 రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివ రణ ఇస్తూ విచారణకు హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Leave a Reply