SUICIDE | ఉరేసుకొని భార్య ఆత్మహత్య

SUICIDE | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : భర్త కోతి అన్నాడని భార్య ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన లక్నో ఇంద్రానగర్‌లో చోటు చేసుకుంది. భర్త రాహుల్ శ్రీవాస్తవ్ తన భార్య తను సింగ్ ని మామూలుగా ‘బందరియా’(కోతి) అని పిలవడంతో తను తీవ్ర మనస్థాపానికి గురై తన గదిలోకి వెళ్ళి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

నాలుగేళ్ల క్రితం రాహుల్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. మోడలింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టం. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… ఇంట్లో అందరూ కలిసి మాట్లాడుకుంటూ… జోక్స్ వేసుకుంటూ గడుపుతున్న సమయంలో రాహుల్ తన భార్యను ‘బందరియా’ అని మామూలుగా పిలిచాడు. తను ఆ మాట వల్ల కోప్పడి గదిలోకి వెళ్ళింది.

కొంతసేపటి తర్వాత, భోజనానికి పిలిచినా తను స్పందించలేదు. రాహుల్ విండో నుంచి చూడగా తను గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించింది. వెంటనే ఆమెను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించగా, డాక్టర్లు ఆమె మృతదేహాన్ని నిర్ధారించారు. తన అక్క అంజలి తెలిపిన వివరాల ప్రకారం… తను మోడలింగ్‌లో చాలా ఆసక్తి కనబరుస్తుంది. చిన్న మాటల వల్ల తను సున్నితంగా బాధపడేది. భర్త అన్న మాట వల్ల ఆమె తీవ్ర మనస్థాపానికి గురైందని తెలిపారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని తెలిపారు.

Leave a Reply