closing ceremonie | భద్రతకు భరోసా ఆర్టీసీ

closing ceremonie | భద్రతకు భరోసా ఆర్టీసీ
- ఏలూరులో జాతీయ రోడ్డు భద్రతా ముగింపు వేడుకలు
- ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్టీసీ డ్రైవర్లకు అవార్డులు
- ఎస్పీ కె. ప్రతాప్ కిషోర్
closing ceremonie | ఏలూరు కార్పొరేషన్, ఆంధ్రప్రభ : ఏలూరులో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఏలూరులోని స్థానిక ఆర్టీసీ డిపోలో జాతీయ భద్రత మహోత్సవముల ముగింపు వేడుకలకు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీలో ప్రయాణం అంటే ఒక భరోసా అని, ప్రయాణికుల గమ్య స్థానానికి సురక్షితంగా చేర్చాలంటే కేవలం ఆర్టీసీతోనే సాధ్యమని అన్నారు.

డ్రైవర్ల ప్రతిభ అంకిత భావంతో విధులు నివారించడమే ఏపీఎస్ఆర్టీసీకి బలం అని తెలిపారు. అనంతరం వారికి ప్రయాణికులను గమ్యస్థానం చేర్చే మార్గంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సుమారు 30 సంవత్సరాలు ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహించిన వారికి అవార్డులు అందజేశారు. ప్రమాద రహిత ఉత్తమ డ్రైవర్ అవార్డ్ లను జిల్లా స్థాయిలో ముగురు సిబ్బందికి 3డిపోలకు గాను ముగ్గురి సిబ్బంది చొప్పున 12 మంది సిబ్బంది కి నగదు పురస్కారంతో పాటు డ్రైవర్స్ దంపతులను సత్కరించి అవార్డ్స్ అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ఆర్టీవో అధికారులు, విద్యార్థులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
