ITC | పరిశ్రమలో పట్టుబడిన దొంగలు..

ITC | పరిశ్రమలో పట్టుబడిన దొంగలు..

ITC, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలోని ప్రముఖ పరిశ్రమ పేపర్ కర్మాగారంలోనీ శుక్రవారం తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు స్టోర్ మెటీరియల్ డిపార్ట్మెంట్లో చొరబడి విలువైన వైర్లను దొంగిలించే క్రమంలో సెక్యూరిటీ గార్డులకు పట్టుబడ్డారు. సెక్యూరిటీ గార్డ్ వలయం దాటి లోపలికి అడుగుపెట్టడం దొంగలించే క్రమంలో పట్టుబడటంతో వెంటనే విచారణ చేపట్టిన సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పోలీస్ వారికి అప్ప చెప్పారు. పట్టుబడ్డ దొంగల పై పోలీసులు విచారణ చేపట్టారు.

దొంగలు ఐటిసిలోకి ఎలా వచ్చారు..?
ఐటిసి కర్మాగారంలోకి అడుగుపెట్టడానికి సెక్యూరిటీ గేటు ముందు 24 గంటలు సెక్యూరిటీ గార్డు నిత్యం చెకింగ్ చేసి పంపడం జరుగుతుంది. లోపలకి వెళ్లే మార్గం మరొకటి ఉండదు. అలాంటి బందోబస్తుతో ఉన్నటువంటి పరిశ్రమలో దొంగలు లోనకి వెళ్లడం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ దొంగలు లోపల పరిశ్రమలో పని చేసేవారా..? లేకపోతే బయట నుంచి వచ్చినవారా..? బయట నుంచి వస్తే.. ఎలా వచ్చారు..? అనే విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది.


నిత్యం సీసీ కెమెరాలు పని చేస్తున్నటువంటి పరిశ్రమలో ఎలా దొంగతనం జరుగుతుంది..? ఎందుకు దొంగతనాలకు వచ్చి పట్టుబడ్డారు అనే విషయాలు లోతుగా దర్యాప్తు చేస్తే ఎవరూ సపోర్ట్ చేస్తున్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు ఉండాలని ఐటీసీ యూనియన్ సంఘాలు కోరుతున్నాయి. పట్టుబడ్డ దొంగలు సారపాక ప్రాంతానికి చెందినవారని, వారు పరిశ్రమల పని చేసేవారు కాదని సమాచారం ఉండగా లోపలకి వెళ్లడానికి ఎలా వెసులుబాటు కలిగింది. ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తున్నారా..? అన్న విషయాలు తెలియాల్సివుంది.

Leave a Reply