Railway track | రైల్వే స్థలంలో కంకర వ్యాపారం

Railway track | రైల్వే స్థలంలో కంకర వ్యాపారం
- పట్టించు కోని అధికారులు
Railway track | బెల్లంపల్లి రూరల్, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణం లోని జాతీయ రహదారి, రైల్వే ట్రాక్ మధ్యన గల ప్రభుత్వ సర్వే నెంబర్ 170 రైల్వే స్థలం ఆక్రమించి జోరుగా ఓ వ్యక్తి కంకర వ్యాపారం యదేచ్చగా సాగుతోంది. 40 ఎం ఎం 30,20,12 ఎం ఎం కంకర కుప్పలు గా పోసి చాలా కాలంగా వ్యాపారం సాగుతున్నా అటు రైల్వే ఇటు రెవిన్యూ శాఖ లు పట్టించు కోక పోవడం తో పలు విమర్శలు వ్యక్త మౌతున్నాయి.
అటుహైవే పక్కనుంచి ట్రాక్టర్లు కంకర కోసం హైవే మీదుగా తరుచుగా వెళ్లడం తో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా రెవెన్యూ రైల్వే శాఖల ఉన్న తాది కారులు స్పందించి అక్రమ కంకర వ్యాపాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
