ఉట్నూర్, మార్చి 8 (ఆంధ్రప్రభ) : ఇటీవల ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం, దస్తూరబాద్ మండలాలకు చెందిన ఆరుగురు మలేషియా దేశ జైల్లో మగ్గుతున్న విషయాన్ని వారి కుటుంబసభ్యుల ద్వారా తెలుసుకుని, వారి విడుదల కోసం మలేషియా దేశానికి వెళ్లి బాధితులను కలుసుకుని నేనున్నానంటూ వారికి భరోసానిచ్చిన ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ను (ట్విట్టర్)ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు.
గత శాసనసభ ఎన్నికల్లో ఖానాపూర్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ, నిత్యం ప్రజల్లో ఉంటూ కష్టాల్లో ఉన్న నియోజకవర్గ ప్రజలకు మీరు అండగా నిలుస్తున్న తీరు ప్రశంసనీయమైనదని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా జాన్సన్ నాయక్ సేవలను అభినందించారు.