Schedule | ఫిబ్రవరి 11న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు

Schedule | ఫిబ్రవరి 11న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
Schedule | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 52,43,000 ఉన్నాయి. ఈనెల 28నుంచి 30వరకు నామినేషన్లు, ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరగనుంది.
