success | అన్ని వార్డుల్లో పోటీ చేస్తాం

success | అన్ని వార్డుల్లో పోటీ చేస్తాం

success | మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : మంథని మున్సిపల్ పరిధిలో జనసేన పార్టీ ఉంటుందని మంథని నియోజకవర్గ ఇన్చార్జి మాయ రమేష్ స్పష్టం చేశారు. మంగళవారం మంథని పట్టణం ప్రెస్ క్లబ్ లో జనసేన ఇన్చార్జి మాయ రమేష్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంథని మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల నుండి పోటీ చేస్తున్నామని ఆయన వివరించారు.

తెలంగాణ అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎనలేని అభిమానమని అన్నారు. జనసేనాని ఇష్టదైవమైన కొండగట్టు అంజన్న ఇచ్చిన ధైర్యంతో మంథని మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని ఆయన తెలిపారు. త్వరలోనే విధివిధానాలను ప్రకటిస్తామని ఆయన ఖరారు చేశారు. జనసేన పార్టీకి అధికార చిహ్నమైన గాజు గుర్తు ఉందని, అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఎన్నికల్లో ముందుకు వెళ్తామని ఆయన వివరించారు.

పార్టీ అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని, పలు పార్టీల నుండి ఆశావాహులు జనసేన నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. పార్టీల్లో కొనసాగుతున్న సీనియర్లకు అవకాశం కల్పిస్తామని, కచ్చితంగా మంథని మున్సిపల్ ఎన్నికల్లో జనసేన విజయం సాధించడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మండల పార్టీ అధ్యక్షుడు బూడిద అనిల్, ముత్తారం పార్టీ అధ్యక్షుడు సట్ల సతీష్, జనసేన నాయకురాలు అంజలి, పార్టీ యువ నాయకులు గాజుల హరీష్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply