- జీవో నెంబర్ 18 రద్దు
( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : గత కొంతకాలంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న పరిష్కరించలేని సమస్యకు పరిష్కారం దొరకడంతో వారికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆటో కార్మికుల జీవనోపాధికి అడ్డంకిగా మారిన జీవో నెంబర్ 18ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.
మరి ముఖ్యంగా విజయవాడ సిటీలో ఈ జీవ కారణంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి జీవనోపాధికి ఎదురవుతున్న ఇబ్బందులను ఇటీవల ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీలో తన గళం వినిపించారు.
అలాగే కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కలిసి వినతి పత్రాలను సైతం అందజేశారు. ఆటో కార్మికులను నష్టపరుస్తూ ఆటో షోరూంలకు అనుకూలంగా ఉన్న జీవో నెంబర్ 8ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వచ్చారు.
విజయవాడ నగర పరిధిలో 8600 ఆటో పరిమితి ఉండటంతో స్థానిక ఆటో కార్మికులు ఆటో కార్మికులు చుట్టుపక్కల మండలాలు ఇబ్రహీంపట్నం, గన్నవరం, పెనమలూరు ఆటోలు నడుపుతున్నారు కానీ ఉన్నటువంటి ఈ మండలాల్లోంచి నగరానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ మండలాల నుండి ప్రవేశిస్తానికి నగరంలోకి ఆటోలు ప్రవేశించడానికి జీవో నెంబర్ 8 అడ్డంకిగా మారిందని అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించారు.
జీవో నెంబర్ 8 అడ్డంకిగా మారడంతో కొత్తగా కొనుగోలు చేసిన ఆటోలకు ఉపయోగపడినప్పటికీ, మిగతా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్న ఈ సమస్యపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 18ని రద్దు చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో వేల సంఖ్యలో ఉన్న ఆటో కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందని, జీవో రద్దు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కి ఎమ్మెల్యే బోండా ఉమా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.