AP | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

AP | ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

  • కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో

AP | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై చాణిక్య ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మనల్ని మనం పాలించుకునేందుకు రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవం గా జరుపుకుంటామని తెలిపారు. డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ మనకు ఇచ్చిన రాజ్యాంగం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పునాదులు వేసిందన్నారు ప్రతిఒక్కరూ రాజ్యాంగ విలువలు కాపాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply