meeting | వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలి..

meeting | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని విబిజీ రామ్ జి చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని నారాయణ పేట జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు కే. ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్లలో మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాల రాస్తే కాంగ్రెస్ మౌనంగా ఉండదని అన్నారు. రైతుల, కూలీల భవిష్యత్తుతో ఆటలాడితే కాంగ్రెస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వం వెంటనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి ప్రజలకు ఉపాధి కల్పించాలన్నారు. పంచాయతీలకు పాలన హక్కులు తిరిగి ఇవ్వాలని ప్రజల గొంతుకగా కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో చిన్నపొర్ల సర్పంచ్ గాండ్ల నికిత ప్రశాంత్, మాజీ జెడ్పిటిసిలు సూర్య ప్రకాశ్ రెడ్డి, మణెమ్మ, మాజీ పీఎస్ఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి పులి మామిడి మాజీ సర్పంచ్ సూరయ్య గౌడ్, చిన్న పొర్ల మాజీ సర్పంచ్, మాలి పటేల్ రవీందర్ రెడ్డి, ఊట్కూర్ మండల యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు కృష్ణ, రమేష్, మిరజ్, వాలియద్ పాషా, రైతులు కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply