AP | ఢిల్లీకి తరలి వెళ్లిన మొవ్వ హై స్కూల్ విద్యార్థినిలు

AP | ఢిల్లీకి తరలి వెళ్లిన మొవ్వ హై స్కూల్ విద్యార్థినిలు
AP | మొవ్వ – ఆంధ్రప్రభ : ఈనెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనటానికి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మొవ్వ మండలానికి చెందిన పీఎం శ్రీ శ్రీ మండవ కనకయ్య జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థులు తమ గైడ్ టీచర్ జాకీర్ అహ్మద్ (పెనమకూరు)తో కలిసి వెళ్లారు. ఈ విద్యార్థులలైన కే.సౌమ్య, డి.స్నేహశ్రీ లు బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించే కార్యక్రమానికి ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిమ్మగడ్డ ఉమాశ్రీ తెలిపారు. గణతంత్ర దినోత్సవం వేడుకలలో ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమాలలోల్యాప్టాప్ ద్వారా ఈ అంశాన్ని ప్రజెంట్ చేయనున్నట్లునున్నట్లు ఆమె తెలిపారు.
