Srikakulam | అరసవల్లి రథసప్తమికి పోటెత్తిన భక్తులు

Srikakulam | అరసవల్లి రథసప్తమికి పోటెత్తిన భక్తులు
Srikakulam | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : స్థానికులు, పరిసర గ్రామాల ప్రజలు మధ్యాహ్నం 12 గంటలు తరువాత దర్శనానికి రావాలి. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అరసవల్లి క్షేత్రంలో భక్తుల సంఖ్య బాగా ఎక్కువగా ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఉదయం 11 గంటల తరువాత మాత్రమే భక్తులు రావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. ఉచిత దర్శనం, నగదు దర్శనం, డోనర్ దర్శనం సహా అన్ని క్యూ లైన్లు పూర్తిగా కిక్కిరిసిపోయాయని అయన తెలిపారు. భక్తులందరికి దర్శనం అయ్యే వరకు అవకాశం కల్పించడం జరుగుతుందని అయన అన్నారు. అన్ని రకాలైన పాసులు ప్రస్తుతం అనుమతించటం లేదని -జిల్లా ఎస్పీ కె. వి.మహేశ్వరరెడ్డి తెలిపారు. భక్తులందరూ గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని,జిల్లా కలెక్టర్, ఎస్పీ కోరారు.

