Dhone | ఏఆర్‌ కానిస్టేబుల్ మృతి

Dhone | ఏఆర్‌ కానిస్టేబుల్ మృతి

Dhone | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా డోన్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గన్ మిస్‌ఫైర్ కావడంతో ఏఆర్‌ కానిస్టేబుల్ మృతిచెందాడు. డోన్‌ జీఆర్‌పీ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పెద్దయ్య అనే కానిస్టేబుల్‌ తెల్లవారుజామున విధుల్లో భాగంగా తెల్లవారు జామున సెల్ఫీ ఫొటో అప్‌లోడ్‌ చేశారు. కాసేపటికే గన్‌ మిస్‌ ఫైర్‌ జరిగి మృతి చెందినట్లు రైల్వే డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply