Venkatesh | దృశ్యం 3 ఉన్నట్టా..? లేనట్టా..?

Venkatesh | దృశ్యం 3 ఉన్నట్టా..? లేనట్టా..?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : విక్టరీ వెంకటేష్‌.. ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రీసెంట్ గా మన శంకర్ వరప్రసాద్ గారు మూవీలో చిరుతో కలిసి వెంకీ చేసిన కామెడీ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు 2027 సంక్రాంతికి కూడా రాబోతున్నాడని.. అది కూడా అనిల్ తో కలిసి రాబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి.. దృశ్యం 3 ఏమైంది..? ఉన్నట్టా..? లేనట్టా..?

Venkatesh

విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో.. ఆదర్శ కుటుంబం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని త్రివిక్రమ్ తన స్టైల్ లో తెరకెక్కిస్తూనే.. ఈసారి కొత్తగా క్రైమ్ ఎలిమెంట్ ని మిక్స్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ లుక్ చూస్తే అదే తెలుస్తోంది. ప్రస్తుతం చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయాలనే టార్గెట్ తో వర్క్ చేస్తున్నారు. త్వరలో ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు.

Venkatesh

ఇదిలా ఉంటే.. ఆదర్శ కుటుంబం రిలీజ్ తర్వాత వెంకీ దృశ్యం 3 స్టార్ట్ చేయనున్నట్టుగా సురేష్‌ బాబు ఇటీవల చెప్పారు. ఈ సినిమా మలయాళ వెర్షెన్ సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఆతర్వాత నుంచి తెలుగు వెర్షెన్ పై ఫోకస్ పెట్టనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అక్టోబర్ లో దృశ్యం 3 తెలుగు వెర్షెన్ రిలీజ్ చేయాలనేది ప్లాన్ అని కూడా నిర్మాత సురేష్ బాబు చెప్పారు. అయితే.. వెంకీతో ఇప్పుడు అనిల్ రావిపూడి మరో సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ కాంబో ఫిక్స్ అయ్యిందని.. ఫిబ్రవరిలో అనౌన్స్ మెంట్.. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. దీంతో దృశ్యం 3 ఉన్నట్టా..? లేనట్టా..? అనేది కన్ ఫ్యూజన్ గా మారింది. మరి.. త్వరలో వెంకీ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.

Venkatesh

CLICK HERE TO READ పెద్ది తెర వెనుక ఏం జరుగుతోంది..?

CLICK HERE TO READ MORE

Leave a Reply