Prabhas | నిర్మాతకు అండగా నిలిచిన రాజాసాబ్..

Prabhas | నిర్మాతకు అండగా నిలిచిన రాజాసాబ్..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ నిరాశపరిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. ఈ సంస్థ ఇటీవల కాలంలో రిలీజ్ చేసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో భారీగా నష్టాలు వచ్చాయి. దీంతో రాజాసాబ్ హిట్ అయితే.. భారీగా లాభాలు వస్తే.. నష్టాల నంచి బయటపడచ్చు అనుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్. కానీ.. రాజాసాబ్ ప్లాప్ అయ్యింది. నిర్మాతకు నష్టాలను మిగిల్చింది. దీంతో నిర్మాతకు అండగా.. ఆపద్భాంధవుడుగా నిలిచాడట ప్రభాస్. ఇంతకీ.. నిర్మాత కోసం రాజాసాబ్ ఏం చేయనున్నాడు..?

Prabhas

ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ రైట్స్ ను విశ్వప్రసాద్ తీసుకున్నారు. ఆ సినిమా నష్టాలు మిగల్చడంతో.. సినిమా చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే.. రాజాసాబ్ చేశారు. అయితే.. రాజాసాబ్ మూవీ కూడా ఇప్పుడు నిర్మాతకు నష్టాలు తీసుకువచ్చింది. ఇప్పుడు కూడా నిర్మాతకు అండగా నిలిచాడట ప్రభాస్. రాజాసాబ్ ప్లాప్ అవ్వడంతో.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట ప్రభాస్. అంతే కాకుండా.. స్పిరిట్ మూవీ రైట్స్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇచ్చేలా చూస్తానని మాట ఇచ్చారట. నిజంగా ఇంతలా ప్రభాస్ నిర్మాతకు అండగా నిలవడం గొప్ప విషయం.

Prabhas

అయితే.. ప్రభాస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో మరో సినిమా చేస్తానని వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడు చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది. మేటర్ ఏంటంటే.. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల తర్వాత కల్కి 2, సలార్ 2 చేయాలి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న స్పిరిట్, ఫౌజీ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో క్లారిటీ లేదు. కల్కి 2, సలార్ 2 ఎప్పుడు పట్టాలెక్కుతాయో తెలియాల్సివుంది. అలాగే ప్రశాంత్ వర్మతో కూడా సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. ఇన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత అంటే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ చాలా కాలం వెయిట్ చేయకతప్పదు. మరి.. ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

Prabhas

CLICK HERE TO READ విశ్వంభర రిలీజ్ డేట్‌ ఇదే..

CLICK HERE TO READ MORE

Leave a Reply