Nara Rohith | మోపిదేవి పుణ్యక్షేత్రంలో ప్రముఖ సినీ హీరో…

Nara Rohith | మోపిదేవి పుణ్యక్షేత్రంలో ప్రముఖ సినీ హీరో…
Nara Rohith | మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ హీరో నారా రోహిత్ ఈ రోజు దర్శించుకున్నారు. ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు ఆహ్వానం మేరకు మోపిదేవికి రోహిత్ వచ్చారు. ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్, బీజేపీ రాష్ట్ర నేత బుచ్చిరాజు స్వాగతం పలికారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు.

నూతన టేకు రథ కలశానికి రోహిత్, నిర్మాత అట్లూరి నారాయణ అభిషేకాలు చేశారు. నారాయణరావు బహుకరించిన రూ.కోటి విలువైన నూతన టేకు రధం రోహిత్ ప్రారంభించారు. నారా రోహిత్ ను డిప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాదరావు, అర్చకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.



CLICK HERE TO READ వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం..
