Political | మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం పోటీ

Political | మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం పోటీ

Political | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల బరిలో సీపీఎం అభ్యర్థులు ఉంటారని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న అభ్యర్థులని గెలిపించాలని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోజు పట్టణ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ మున్సిపల్ కార్యదర్శివర్గ సభ్యులు బండారు నరసింహ అధ్యక్షతన పార్టీ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు.

ఎన్నికల్లో కలిసి వచ్చే శక్తులతో కలుపుకుని ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. మున్సిపాలిటీగా ఏర్పడిన నాటినుండి పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం, నిరంతరం ఉద్యమాలు, పోరాటాలు, నిర్వహిస్తున్న సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల సమస్యల మీద పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని, ప్రజా సమస్యలు మీద ఎలాంటి అవగాహన లేని వారు డబ్బు, మద్యంతో, ప్రజలను మోసం చేయడానికి వస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సీపీఎం మున్సిపల్ కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు గోశిక కరుణాకర్, ఎండి పాషా, అవ్వారి రామేశ్వరి, కార్యవర్గ సభ్యులు దండా అరుణ్ కుమార్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ గోపగోని లక్ష్మణ్, బత్తుల దాసు, ఉస్కాగుల శ్రీనివాస్, ఆకుల ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply