Dirt road | ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం మ‌ట్టి రోడ్డు ఏర్పాటు..

Dirt road | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బూర్నపల్లి ఎంపేడు గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇసంపల్లి పోశాలు.డ్యాగర మల్లేష్ నాయకులతో కలిసి టేకుమట్ల మండలం బూర్నపల్లి ఎంపేడు గ్రామాల మధ్యలో గల చలివాగుపై ప్రజల సౌకర్యార్థం మట్టి రోడ్డు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్టు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ తెలిపారు.

గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉచితంగా ప్రయాణికులు ఈ మార్గం ద్వారా జమ్మికుంట.భూపాలపల్లి పట్టణాలకు దగ్గర మార్గంగా సులువుగా ఉంటుందని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజల అవసరాలు గుర్తించే పని చేసే ప్రజానాయకుడు గండ్ర సత్తన్న పై ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా సతీష్ గౌడ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో బూర్నపల్లి సర్పంచ్ నేరెళ్ల రామకృష్ణ గౌడ్, ఎంపేడు ఉపసర్పంచ్ నేరెళ్ల తిరుపతి గౌడ్, వార్డు మెంబర్లు బోల్లి పైడయ్య, దుగ్యాల సాయిలు, నాయకులు దేశిని మొగిలి, గాజర్ల విష్ణు, శ్రీపతి మల్లేష్, ద్వారక పేట మాజీ సర్పంచ్ పార్నంది బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply