worldcup |ఆడకుంటే వారికి కోట్లల్లో నష్టం

ఆడకుంటే వారికి కోట్లల్లో నష్టం
- టీ20 వరల్డ్కప్ బంగ్లాదేశ్ ఆడటంపై సస్పెన్స్
- భారత్‌లో ఆడేది లేదంటూ ఇప్పటికే బీసీబీ ప్రకటన
- తప్పుకుంటే బోర్డుకు తీరని నష్టం
worldcup |వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : టీ20 వరల్డ్కప్ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఆడకుంటే ఆ బోర్డు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. భారత్‌లో ఆడమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ )అంటోంది. ఐసీసీ ఏమో ఆడాల్సిందే అంటుంది. ఐసీసీ తమపై చేస్తున్న ఒత్తిడికి తలొగ్గేది లేదని బీసీబీ ఇప్పటికే చెప్పింది. దీంతో అసలు బంగ్లా ఈ టోర్నీలో ఆడుతుందా? లేదంటే వాళ్ల స్థానాన్ని ఇంకో జట్టు ఆడుతుందా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

worldcup |ఎంత నష్టమంటే..?
ఈ వరల్డ్ కప్ ఆడకుంటే బీసీబీ భారీగా నష్టపోయే అవకాశం ఉంది. సుమారు రూ.240 కోట్ల మేర బీసీబీ నష్టపోయే చాన్స్ ఉంది. అలాగే బ్రాడ్‌కాస్ట్, స్పాన్సర్‌షిప్ రూపంలోనూ తమకు రావాల్సిన ఆదాయంలో 60 శాతం కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతటి నష్టం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది! అంతేకాకుండా వరల్డ్కప్ లాంటి బడా టోర్నీని బహిష్కరిస్తే, బంగ్లాకు స్పాన్సర్లు సైతం వెనక్కితగ్గే అవకాశాలు లేకపోలేదు.

worldcup |ద్వైపాక్షిక సిరీస్పై కూడా ప్రభావం
తాజా వివాదంతో ఈ ఏడాది బంగ్లాతో భారత్ ఆగస్టు- సెప్టెంబర్లో సిరీస్ ఆడనుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్యా ఈ సిరీస్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలున్నాయి. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఆర్థికంగా మరింత దెబ్బ తీయనుంది. భారీ మొత్తంలో ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. అయితే బంగ్లాదేశ్ క్రికెటర్లకు మాత్రం భారత్‌కు వచ్చి వరల్డ్కప్ ఆడాలని ఉందట! కానీ ఆ దేశ ప్రభుత్వం, బీసీబీ నిర్ణయంతో ఆటగాళ్లు ఏమాత్రం సంతృప్తిగా లేరని వార్తలు వస్తున్నాయి. భారత్‌లో వరల్డ్కప్ మ్యాచ్ల విషయంపై ఇప్పటిదాకా బంగ్లాదేశ్ తమ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. దీంతో బీసీబీకి ఐసీసీ ఇచ్చిన గడువు ముగిసింది. ఇక ఈ వ్యవహారంపై శుక్రవారం సాయంత్రంలోపు ఐసీసీ తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కాగా, మరోవైపు బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ టీ20 వరల్డ్ కప్ ఆడనుందని వార్తలు వస్తున్నాయి.

